చర్మం పై ఎర్రటి మచ్చలు ఎందుకు వస్తాయి..? కారణాలేంటంటే..?

-

చాలామందికి అప్పుడప్పుడు చర్మ సమస్యలు వస్తాయి. కొంత మందికి చర్మం పై ఎర్రటి మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. అసలు ఎర్రటి మచ్చలు ఎందుకు వస్తాయి..? దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణ చర్మ సమస్య చర్మం పై ఏ భాగంలో అయినా ఇది రావచ్చు. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటివి కలగడం వలన చర్మం ఎర్రగా మారుతుంది. తామర, సోరియాసిస్, దద్దుర్లు, దోమ కాటు, రింగ్ వార్మ్ కారణాల వలన చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై ఎర్రని మచ్చల్ని తొలగించడానికి కలబంద ఎంతగానో సహాయం చేస్తుంది. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కోల్డ్ కంప్రెస్ ని ఉపయోగించడం వలన కూడా చర్మం పై దురద మంట వంటివి తగ్గుతాయి.

ప్రభావిత ప్రాంతాల్లో కోల్డ్ కంప్రెస్ ని ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే మీరు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే టీ ట్రీ ఆయిల్ ని ఉపయోగించొచ్చు. ఇది ఇన్ఫెక్షన్ ని సులువుగా దూరం చేస్తుంది కాబట్టి మచ్చలు ఏర్పడినప్పుడు దీనిని మీరు వాడొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఇన్ఫెక్షన్స్ వంటివి ఏర్పడిన చోట అప్లై చేస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. అలాగే ఓట్ మీల్ తో స్నానం చేయడం కూడా హెల్ప్ చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఎర్రని మచ్చలు సులువుగా తొలగిపోతాయి ఇలా ఈ చిట్కాలతో ఎర్రని మచ్చలు తొలగించుకోవచ్చు ఒకవేళ కనుక సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news