మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం. పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు సిగ్గు చేటు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అలాగే ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి మద్యాన్ని దోచుకోవడం నిజం కాదా.. SEB పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా.. తయారీ నుండి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
జగన్ కల్తీ మధ్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న, దేశ వ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా పాలసీ తీసుకొచ్చాం. రూ.99 కే క్వార్టర్ మద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి ధరల్ని నిర్ణయించబోతున్నాం. త్వరలోనే కల్లు గీత కార్మికులకు కేటాయించిన షాపులకు త్వరలోనే దరఖాస్తులు పిలుస్తాం అత్యంత పారదర్శకంగా మద్యం శాపులా కేటాయింపు జరిగింది. ప్రభుత్వంపై నమ్మకంతో 89,882మంది దరఖాస్తు చేసుకున్నారు. షాపులు ఏర్పాటు చేశారు. రీహాబిలిటేషన్ కోసం అదనంగా 2% సెస్ అమలు చేస్తున్నాం. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు అని గుర్తుంచుకోండి అని మంత్రి పేర్కొన్నారు.