రుణమాఫీపై వ్యవసాయ మంత్రిని రైతులు నిలదీయాలి : పువ్వాడ అజయ్

-

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 310 రోజులు అయినా రుణమాఫీ లేదు.. రైతు భరోసా లేదు. కౌలు రైతులకు గిట్టుబాటు ధర లేదు.. 100 రోజుల్లో అన్నా 300 రోజుల్లో కూడా కనపడటం లేదు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మన జిల్లాలో ఉన్న వ్యవసాయ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రి కానీ సమాధానం లేదు. ఎన్నికల్లో ప్రతి దేవుడి పై ప్రమాణం చేసి మాట తప్పన ప్రభుత్వం. సగం సగం రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై చావు చప్పట్లు కొట్టాలి. రుణమాఫీ పై రోజు కోక మాట చేబుతున్న వ్యవసాయ మంత్రి ని రైతులు నిలదీయాలి అని సూచించారు.

తులం బంగారం లేదు, పెన్షన్ లేదు, దళిత బంధు లేదు, గ్యాస్ సబ్సిడీ లేదు.. . ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సి నా బాషా ఏలా ఉందో ప్రజలు గమనించాలి. చావు నోట్లో తలకాయా పెట్టి తెలంగాణ తేకపోతే.. నీకు టిపిసిసి లేదు, ముఖ్యమంత్రి పదవి లేదు.. అన్ని అనుమతులు తేచ్చి అంతా సిద్దం చేస్తే ఖమ్మం వచ్చి సీతారామ ప్రాజెక్టు నీళ్ళు చల్లుకోని అన్ని మేమే చేసాం అని చేబుతున్నారు. సీతారామ ప్రాజెక్టు తో ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. కాలేశ్వరం ప్రాజెక్టు పెద్ద మోసం అని విష ప్రచారం చేస్తూ.. మురికి ముసి కోసం లక్ష యాబై వేల కోట్లు ఏలా ఖర్చు చేస్తారు అని ప్రశ్నించారు పువ్వాడ అజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news