కూల్ డ్రింక్స్ బాటిల్ కింద ఎందుకు ఫ్లాట్ గా ఉండదు..? కారణం ఏంటంటే..?

-

ప్రతిదీ కూడా ఏదో ఒక కారణంతోనే రూపొందించబడుతుంది. కొన్ని కొన్ని సార్లు కొన్ని వాటికి అర్థాలు తెలిస్తే మనకి షాకింగ్ గా ఉంటుంది. కూల్ డ్రింక్ బాటిల్స్ ని మనం గమనించినట్లయితే, కింద చిన్న బంప్ లాగ ఉంటుంది. అవి ఫ్లాట్ గా ఉండవు. ఇవేవో అందంగా కనిపించాలని ఇలా డిజైన్ చేసారు. దానిలో ఏముంది అని తీసిపారేయొద్దు. నిజానికి ప్రతీ దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాకుండా గతంలోకి వెళ్తే పూర్వకాలంలో అంటే చాలా ఏళ్ళ క్రితం బటర్ మిల్క్, నిమ్మరసం వంటి వాటిని తాగేవారు. 17వ శతాబ్దంలో కూల్ డ్రింక్స్ అనేవి వెలుగులోకి వచ్చాయి.

 

మొట్టమొదట సాఫ్ట్ డ్రింక్ ఏదంటే నిమ్మరసం, తేనే, నీళ్లు తో తయారు చేయబడింది. 1676లో ఫ్రెంచ్ కంపెనీ దీనిని సేల్ చేయడం మొదలుపెట్టింది. యూరోపియన్లు దీనిని ఇమిటేట్ చేస్తూ ఒక కార్బోనేటెడ్ వాటర్ ని తీసుకొచ్చారు. 1780లో కార్బోనేటెడ్ వాటర్ ని మాన్యువల్ గా చేయడం మొదలుపెట్టారు. ఇక కూల్ డ్రింక్స్ బాటిల్స్ కి ఎందుకు ఆకారం అలా ఉంటుంది..? కింద ఎందుకు ఫ్లాట్ గా ఉండదు అనేది చూస్తే.. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది.

కూల్ డ్రింక్స్ లో గ్యాస్ ఉంటుంది. అదే దానికి ముఖ్యమైన కారణం. కూల్ డ్రింక్ బాటిల్ కనుక ఫ్లాట్ గా ఉన్నట్లయితే కూల్ డ్రింక్ బాటిల్స్ లో ఉండే కూల్ డ్రింక్ వాల్యూం మారిపోయే అవకాశం ఉంటుంది. ఇలా బాటిల్ ని డిజైన్ చేయడం వలన వాల్యూమ్ ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ వాల్యూం పెరిగినా ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. పైగా పైన కంటే కింద కొంచెం టైట్ గా ఉంటుంది దీంతో ప్రెషర్ విషయంలో ఇబ్బందులు కలగవు.

Read more RELATED
Recommended to you

Latest news