గ్రూప్-1 పై ఆందోళన.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్..!

-

తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం అశోక్ నగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్డు పై బైఠాయించిన విషయం తెలిసిందే. గ్రూపు-1 అభ్యర్థులతో పాటు అశోక్ నగర్ చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు బండి సంజయ్. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి నుంచి బండి సంజయ్ కి ఫోన్ వచ్చింది. జీవో నెం.29 గురించి చర్చిద్దామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. తాజాగా గ్రూపు-1 అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపడుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న శ్రీనివాస్ గౌడ్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రూపు-1 అభ్యర్థుల ఆందోళనతో సచివాలయం వద్ద పోలీసులు భారీ మోహరించారు. సచివాలయం వద్దకు చేరుకున్నారు గ్రూపు-1 అభ్యర్థులు. సచివాలయం వద్ద పోలీసులు, గ్రూపు-1 అభ్యర్థుల మధ్య తోపులాట జరుగుతోంది. దీంతో కాస్త ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news