నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి

-

నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చామని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా గ్రూపు-1 అభ్యర్థుల ఆందోళన గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ నిబంధనను 1:100 కోరుకుంటే.. మేము ఇచ్చి ఉండేవాళ్లం.  కాలయాపనకు పుల్ స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. 563 పోస్టులకు 31వేల మంది మెరిట్ ఆధారంగా మెయిన్స్  సెలెక్ట్ చేశామని తెలిపారు.  ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత మార్చితే కోర్టులు ఊరుకుంటాయా..? అని ప్రశ్నించారు. 

నిరుద్యోగుల యువకులు మీరు వెళ్లి వాళ్ల గేట్ల దగ్గర నిలిచి ఉంటే అవకాశం ఇచ్చారా..? ఆలోచించండి. గద్దర్ ను ఎండలో నిలబెట్టిన చరిత్ర ఉన్న వారు ఈ జపం కొంగ జపం కాదా..? అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం జరగాలనే 1:50 పిలుస్తున్నామని తెలిపారు.  ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నాకు ఏమైనా ఉద్యోగం వచ్చేది ఉందా..? మీరు పోటీ పరీక్షల్లో పోటీ పడి ఉద్యోగాలు సాధించండి. మంచి పౌరులుగా దేశంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు. దయచేసి ఆందోళన విరమించండి.. అపోహల సంఘం మీ జీవితాలతో చెలగాటం ఆడుతుంది. గతంలో వారు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి. పోలీస్ సిబ్బందికి కూడా వాళ్లు ఆందోళన చేస్తున్నప్పుడు మర్యాద పూర్వకంగా వ్యవహరించండి. లాఠీ ఛార్జీ చేయాల్సిన అవసరం లేదు. కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. కేసులు పెడితే.. వాళ్ల జీవితం నాశనం అవుతుంది అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 

 

Read more RELATED
Recommended to you

Latest news