బీఆర్ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం.. ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

-

రాష్ట్రంలో కృత్రిమ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం నడుస్తుందని, హైడ్రా నుంచి కాపాడుకునేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విపక్షాలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ప్రభుత్వంపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, వీరి స్వార్థ ప్రయోజనాల కోసం సందు దొరికితే శవంపై గద్దల్లాగా వాలి ప్రభుత్వాన్ని అబాసు పాటు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలపై ప్రేమ లేదని, వారి ఆస్తులను కాపాడుకునేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు చేస్తున్నట్లు అర్థం అవుతుందన్నారు. ఈ చర్యలన్ని హైడ్రా నుంచి  కాపాడుకునేందుకేనని, అందుకే ప్రజలు వారి ట్రాపుల్లో పడొద్దని, పేదల భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news