తెలంగాణా మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విపక్షాల్లో ఇప్పుడు సరికొత్త సమస్యలు బయటకు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరు తెన్ను లేకుండా వ్యవహరించడం ఇప్పుడు అధికార తెరాస పార్టీకి కలిసి వస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సీటు తెచ్చుకోవడం అంటే ఎన్నో దాటుకుని రావాల్సి ఉంటుంది. వాటిని దాటుకుని వచ్చి సీటు తెచ్చుకున్నా సరే గెలుపుకి,
ఇతర నేతలు ఎంత వరకు సహకరిస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల్లో కెసిఆర్ ఒక వ్యూహం అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తులను ఆయన టార్గెట్ చేసారు. మంత్రులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనితో మున్సిపల్ ఎన్నికల్లో సీటు వస్తుందని భావించిన కొందరు నేతలకు మంత్రులు గాలం వేసారు. వారితో మంత్రులు నేరుగా మాట్లాడటం,
వారి కోరికలను తెలుసుకోవడం చేస్తున్నారు. సీటు వచ్చినా సరే గెలుస్తామో లేదో అనే భయం ఉన్న నేతలను కూడా మంత్రులు టార్గెట్ చేసారు. దీనితో వారు అందరూ కూడా మంత్రుల వద్దకు వస్తున్నారు. నామినేషన్ ఉపసంహరించుకుంటామని చెప్తూ, తమకు భవిష్యత్తు చూపించాలని కోరుతున్నారు. దీనితో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. బిజెపి గురించి అసలు పరిశీలకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.