చంద్రబాబు లోఫర్ సిక్స్, పవన్ జోకర్ సిక్స్ అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిక్కోడు బాలకృష్ణ కాళ్లను హోంమంత్రి అనిత మొక్కిందని ఎద్దేవా చేశారు. చెప్పినవన్నీ చేశాడు కాబట్టి జగన్ సూపర్ అని పొడిగారు గోరంట్ల. కూటమి ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. కడప జిల్లా బద్వేల్ లో ఇంటర్ విద్యార్థిని మరణించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర పరిపాలన గాడి తప్పిందంటే.. టీడీపీ-జనసేన నేతలు వైసీపీ పై పంచ్ లు విసురుతున్నారని పేర్కొన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు అసలు జరుగలేదని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం పరిస్తితి ఏంటో ప్రజలే గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.