విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో..టీడీపీ నేతలకు అవమానం జరిగింది. డయేరియా నివారణకు శాశ్వత పరిష్కారం కావాలి.. అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని గుర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా డయేరియా బాధితులను పరామర్శించారు పవన్.
రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ పరిశీలన చేశారు పవన్. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇక మరోవైపు హడావిడిగా సాగింది పవన్ పర్యటన. అభిమానుల హడావిడి, పోలీసుల ఓవర్ యాక్షన్ తో ముగిసింది పవన్ పర్యటన. లోకల్ ఎమ్మెల్యేలను కూడా సెక్యూరిటీ కల్పించలేకపోయారు పోలీసులు. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఎస్.కోట ఎమ్మెల్యేలను పక్కకు నెట్టేసిన పోలీసులు.. దౌర్జన్యంగా వ్యవహరించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను సైతం లెక్క చేయలేదట పోలీసులు.
విజయనగరం జిల్లా గుర్ల మండలం SSR పేట పంపు హౌస్‌ను, నీటి నాణ్యతను పరిశీలించి అతిసార బాధిత కుటుంబాలను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/c6bbeNW1xJ
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024