ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం రాజాసాబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విషెష్ తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఎల్లుండి టైటిల్ ట్రాక్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త లుక్ లో ప్రభాస్ అదిరిపోయారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే ఇవాళ ఉదయం రాజాసాబ్ నుంచి ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ రానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నేను రెడీ.. మీరు రెడీ నా.. అంటూ మూవీ మేకర్స్ రాసుకొచ్చారు. చెప్పినట్టుగానే సరిగ్గా 4.05 గంటలకు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజా సాబ్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news