మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక అందించేందుకు రెడీ అవుతున్నారు. దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు సీఎం చంద్రబాబు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఏడాదికి రూ.2,684 కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి చంద్రబాబు ఆమోదం తెలిపారట. మహిళా సంక్షేమానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు…ఎన్నకల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఇక దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది చంద్రబాబు సర్కార్.