ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ప్రభాస్ కి సంబంధించిన రెండు పోస్టర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో  తాజాగా రాజాసాబ్ మోషన్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ మోషన్ పోస్టర్ లో ప్రభాస్ అడవిలో పియానో ప్లే అవుతుండగా.. ఓ భవంతిలోకి తీసుకెళ్లి ప్రభాస్ ముసలి గెటప్ లో చుట్ట కాల్చుతూ సింహాసనం మీద కూర్చున్నట్టు కనిపిస్తోంది. ఈ మోషన్ పోస్టర్ అంతా హారర్ మ్యూజిక్ తో అదిరిపోయిందనే చెప్పాలి. చివరిలో హారర్ కొత్త కామెడీ అని పోస్ట్ చేయడంతో ఈ మూవీ హారర్, కామెడీ జోనర్ లో ఉండబోతుందని స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రభాస్ రెండు గెటప్ లలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ తాత, మనవడు లేదా తండ్రి, కొడుకు గెటప్స్ ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి మోషన్ పోస్టర్.

Read more RELATED
Recommended to you

Latest news