విటమిన్‌ D లోపం వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయా..? ఈ జాగ్రత్తలు అవసరం..

-

మనం మాట్లాడేప్పుడు ఎదుటి వ్యక్తి మనలో మొదట చూసేది కళ్లు, పళ్లు. ఇవి రెండు అందంగా ఉంటే.. ఆటోమెటిగ్‌గా మనం చెప్పే కాన్సప్ట్‌ ఏదైనా అలా వినేస్తారు అంతే.. సినిమాల్లో చూపించినట్లు..! దంతాలు తెల్లగా మెరిస్తే ఎంతమందిలో అయినా ధైర్యంగా మాట్లాడొచ్చు. అందరూ బ్రష్‌ చేస్తారు.. కానీ పళ్లు మాత్రం ఎందుకు గారపట్టి ఉంటాయి. మనం చేసే కొన్ని తప్పుల వల్లే పళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని విటమిన్స్‌ లోపించడం వల్ల కూడా దంతాల సమస్యలు వస్తాయి.

మౌత్‌ వాష్‌ వాడొచ్చా..

రోజువారీ నోటి పరిశుభ్రతలో మౌత్ వాష్ చాలా ముఖ్యమైనది. మౌత్‌వాష్‌ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందమైన చిరునవ్వు మరింత అందంగా కనిపించేలా చేయడంలో ఇది హెల్ప్‌ అవుతుంది.

డీ లోపిస్తే డేంజరేనా..?

విటమిన్ డి లోపం కారణంగా దంతాలు, చిగుర్లు దెబ్బతింటాయి. దంతాలను శుభ్రపరుచుకోవడంలో ఏ మాత్రం ఏమర పాటు ఉండకూడదు. బ్లడ్ క్యాన్సర్లు, ఎముక కాన్సర్ సంకేతాలు నోటిలోనే కనిపిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి కలిగి ఉండే నారింజ, ఆకుపచ్చ బెల్ పెప్పర్స్, ట్యూనా, సాల్మన్ మొదలైన వాటిని ఆహరంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.

బ్రష్ చేయడానికి ముందు ఫ్లాసింగ్ చేయడం వల్ల ఎక్కువ బ్యాక్టీరియా తొలగిపోతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలు ,బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి ఫ్లాసింగ్ సహాయపడుతుంది. తరువాత బ్రష్ చేయడం వల్ల నోరు మరింత శుభ్రం అవుతుంది.

భోజనం చేసిన ప్రతిసారి మన దంతాల్లో కొన్ని ఆహారపదార్థాలు పళ్లల్లో ఇరుక్కుపోతాయి. భోజనం చేసిన తరువాత పళ్ళను శుభ్రంచేసుకోవడం చాలా మంచిది. దంతదావనం చేసిన సమయంలో చూపుడు వేలితో చిగుర్ల పై మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్లకు మంచి ఎక్సరసైజ్ అవుతుంది.

డెంటిస్ట్‌ సూచనలతో టూత్ బ్రష్, మౌత్ వాష్, డెంటల్ ఫ్లాస్, టంగ్ క్లీనర్‌తో డెంటల్ కిట్‌ను తప్పనిసరిగా ఎంచుకోవటం మంచి అలవాటు. ఏవైనా దంత సమస్యలు ఎదురైతే వెంటనే దంత పరీక్షలను చేయించుకోవాలి. ఏం నొప్పి లేదుగా..ఏం అవుతుందిలో అని అస్సలు లైట్‌ తీసుకోకుండి. దంతాలు బాలేకుంటే ఆ ఎఫెక్ట్‌ గుండె మీద పడుతుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news