నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు..టైమింగ్స్ ఇవే

-

నేటి నుంచి విజయవాడ-విశాఖ మధ్య మరో ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఇవాళ సా.7.15 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకోనుంది ఫ్లైట్.. తిరిగి 8.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడకు రానుంది విమానం. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇది ఇలా ఉండగా.. .విశాఖ భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

New flight services between Visakha and Vijayawada from today

500ఎకరాలలో ఏవియేషన్ సర్వీసులు, సౌకర్యాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామన్నారు. భోగాపురం విమానాశ్రయం బ్రైట్ స్పాట్ గా మారుతుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వారణాసి, అయోధ్యకు విమాన సర్వీసుల ఇవ్వాలని అభ్యర్థన వుంది…విశాఖ నుంచి వీలైనన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. విజయవాడ – విశాఖ మధ్య రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ ధరలు తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news