విశాఖ భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 500ఎకరాలలో ఏవియేషన్ సర్వీసులు, సౌకర్యాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామన్నారు. భోగాపురం విమానాశ్రయం బ్రైట్ స్పాట్ గా మారుతుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
వారణాసి, అయోధ్యకు విమాన సర్వీసుల ఇవ్వాలని అభ్యర్థన వుంది…విశాఖ నుంచి వీలైనన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. విజయవాడ – విశాఖ మధ్య రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ ధరలు తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్ బస్ తో కనెక్ట్ చేయడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. అయ్యప్ప భక్తులు ఇరుముడితో వెళ్లే సౌకర్యం కల్పించామని ప్రకటించారు. జనవరి 20 వరకు దీక్ష దారులు ఇరుముడి తో వెళ్లేందుకు సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిబంధనల లో మార్పులు చేసి సర్క్యులర్ ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.