తిరుమలలో పెరిన భక్తుల రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం!

-

దీపావళి పండుగను పురస్కరించుకుని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.శనివారం శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులకు దాదాపు 6 నుంచి 8 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతోందని సమాచారం. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు శ్రీవారి దర్శనానికి నేరుగా పంపుతున్నారు.శనివారం స్వామి వారిని 77,884 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 27,418 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు.తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.327 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news