జన్వాడ రేవ్ పార్టీలో వ్యాపారవేత్త విజయ్ మద్దూరి అడ్డంగా దొరికిపోయారు. జన్వాడలో ఓ ఫామ్ హౌస్ లో VIP ల రేవ్ పార్టీ భగ్నం చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. ఈ తరుణంలోనే… విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ నిర్థారణ కూడా అయింది. దీంతో విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… NDPS యాక్ట్, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఈ రేవ్ పార్టీలో పలువురు ప్రముఖులు..పాల్గొన్నారు. రేవ్ పార్టీ వివరాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు రావడానికి కొద్దిసేపటి ముందే ఫామ్ హౌస్ నుంచి ఓ రాజకీయ నాయకుడు వెళ్లి పోయారంటూ ప్రచారం జరుగుతోంది. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో అర్థరాత్రి పార్టీలు నిత్యకృత్యమని అంటున్నారు స్థానికులు. అంతేకాదు… భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ పార్టీ లో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేస్తున్నారట పోలీసులు.