శ్రీకాకుళం జిల్లాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. టిడిపి వైసిపి వర్గాల మధ్య ఘర్షణ ఎఫెక్ట్ తో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి , వైసిపి డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు ఇంటి వద్ద పోలీసుల మోహరించారు. పోలీసు స్టేషన్ లో వైసీపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా పోలీసు స్టేషన్ కు బయలుదేరారు అప్పలరాజు. అప్పలరాజును అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అప్పలరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
వైసిపి కార్యకర్తలపై దాడి చేసిన టిడిపి నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మొహరించారు. ఇంటి వద్ద ధర్నా చేసిన అప్పలరాజు…. అధికార పార్టీ దౌర్జన్యం ..నశించాలని ఆగ్రహించారు. శిరీష డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసుల హామీ ఇచ్చారు. వెనుక కు తగ్గిన అప్పలరాజును హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.