జన్వాడ పార్టీలో ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగలేదు – విజయ్ మద్దూరి

-

జన్వాడ పార్టీలో ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగలేదని క్లారిటీ ఇచ్చారు విజయ్ మద్దూరి. రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ గురించి స్పందించిన విజయ్ మద్దూరి..కీలక వ్యాఖ్యాలు చేశారు. నా పేరుతో సామాజిక మాధ్యమాలు మీడియాలో అనేక రకాల రూమర్లు వస్తున్నాయని… నా పేరుతో ఎఫ్ఐఆర్‌లో పెట్టిన ప్రతి వాక్యం తప్పే .. నా వాదన చాలా స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ పేరుతో చేస్తున్న ప్రచారం అంతా తప్పే అన్నారు.

Vijay Madduri

నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్లు ఎఫ్ఐఆర్‌లో రాశారని… నేను ఒక అమెరికన్ సిటిజెన్ మాత్రమే కాకుండా పెట్టుబడిదారుగా అనేక దేశాల్లో క్లీన్ రికార్డుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిని అంటూ తెలిపారు. నేను ఈ మధ్యనే విదేశాలు వెళ్లి వచ్చాను.. దానికి సంబంధించిన ఋజువులను కూడా చూపించానని తెలిపారు. ఇండియాలో నేను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదని… నా మిత్రుడు రాజ్ పాకాల తమ ఫ్యామిలీ ఫంక్షన్‌కి దీపావళి పార్టీ కోసం ఆహ్వానించారు, నా కుటుంబంతో ఆ ఫంక్షన్‌కి హాజరయ్యానని వివరించారు. ఆ ఫంక్షన్‌లో చిన్న పిల్లలతో సహా మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news