ఝార్ఖండ్ లో గెలుపు ధీమాలో బిజేపీ.. ఈసారి వ్యూహాలు ఫలిస్తాయా..?

-

ఝార్ఖండ్ లో కమలం పార్టీ గేమ్ స్టాట్ చేసింది.. గత ఆరునెలల నుంచి టార్గెట్ ఝార్ఖండ్ అన్నట్లు కమలం పార్టీ నేతలుఏ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.. జేఎంఎం మాజీ సీఎం చంపాయి సొరెన్ తోపాటు.. పలువురు కీలక నేతల్ని పార్టీలోకి చేర్చుకోవడంలో సక్సెస్ అయింది.. ఆ తర్వాత ఒక్కొక్క స్టాటజీని అమలు చేస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి క్యాడర్ లో కాన్ఫిడెంట్ ను బిల్డప్ చేసింది.. దీంతో బిజేపీ జెండా ఎగిరేలా కసరత్తు చేస్తోంది..

గత ఎన్నికల్లో తృటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలని బిజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. అట్టడుగు స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకుని.. పార్టీని బలోపేతం చేసుకుంది.. ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని.. ఎన్నికలకు సిద్దమైంది.. ఈ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ,జనతాదళ్ యునైటెడ్ తో వంటి పార్టీలతో బీజేపీ కలిసి పోటీ చేస్తోంది.

ముఖ్యంగా ఏజేఎస్‌యూతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గత ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన గిరిజన ఓట్లను తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతీయ పార్టీలతో పాలుపంచుకోవడం ద్వారా, బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. గిరిజన ఓట్లను కొల్లగొట్టేందుకు బిజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.. 81 అసెంబ్లీ సీట్లున్న ఝార్ఖండ్లో 28 ఎస్టీ, 9 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి.. గత ఎన్నికల్లో 26 స్థానాల్లో కూటమి అభ్యర్దులు గెలిచారు..దీంతో ఈసారి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను బిజేపీ సిద్దం చేసుకుంది..

జేఎంఎంలో ఉండే అంతర్గత విబేదాలు తమకు కలిసొస్తాయని బిజేపీ అభిప్రాయపడుతోంది..అవినీతి ఆరోపణలు , హామీలు అమలు కాకపోవడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరిపాలనపై మెజార్టీ ప్రజలు అసంతృప్తి ఉన్నారని బిజేపీ చెబుతోంది.. ఖచ్చితంగా ఈసారి ఝార్ఖండ్ లో కషాయం జెండా ఎగరడం ఖాయమనే ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news