ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల్లో అభద్రతాభావం ఏర్పడింది అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల కోసం దిశ చట్టం తీసుకువచ్చారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మహిళల రక్షణ కోసం మహిళ పోలీస్ స్టేషన్లు మహిళ కోర్టులు దిశ యాప్ ను ప్రవేశపెట్టాం. కేంద్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసి మనకు అవార్డులు ఇచ్చింది.
కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ చట్టాన్ని తీసేసాడు. నంద్యాల, బద్వేలు, తెనాలి, హిందూపూర్, పలాసలలో మహిళల పైన అత్యాచారాలు హత్యాచారాలు జరుగుతున్నాయి. పలాసలో పది పదిహేను రోజులుగా దౌర్జన్య కాండ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎవడికి ఎక్కువ కేసులు ఉంటే వాడికే పదవి అన్న లోకేష్ మాటలు గుర్తు తెచ్చుకోవాలి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగ అమలవుతోంది అని సీదిరి అప్పలరాజు అన్నారు.