ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం జాతకాలా..?

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషంలో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా బరిలో దుమ్ము దులిపేందుకు సిద్ధమవుతుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ఆన్ లైన్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 2న సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు జాతకాలతో ముడిపెట్టినట్టు వార్తలొస్తున్నాయి. హీరో జాతకం ఆధారంగా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట.

 

సినిమా రిలీజ్ కు జాతకం చూశారని చెప్పినా అందులో ఓ అర్ధం ఉంటుంది. కాని ఈ వేడుకకు ఎందుకు అంటే ఇటీవల హరికృష్ణ మరణం వల్ల చాలా డిస్ట్రబ్ అయిన ఎన్.టి.ఆర్ ప్రతిది కాస్త జాతకరీత్యా వెళ్తే మంచిదని అనుకుంటున్నాడట. ఇది తన కోసం కాకున్నా తన మీద ఆధారపడిన దర్శక నిర్మాతల కోసమని అంటున్నారు. అక్టోబర్ 2న అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందట. ఆరోజు సాయంత్రం ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరైనా వస్తున్నారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

నిర్మాత, దర్శకుల సలహా మేరకే ఆరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నారట. హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేతలో పూజా హెగ్దె అరవిందగా నటిస్తుండగా ఈషా రెబ్బ మరో హీరోయిన్ గా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news