మైనింగ్ వ్యవస్థను మాఫీయా మయం చేసి దోచుకున్నారు : మంత్రి కొల్లు రవీంద్ర

-

గత ఐదేళ్లు కూడా మైనింగ్ వ్యవస్థను మాఫీయా మయం చేసి దోచుకున్నారు. భూ ఆక్రమణలకు, దౌర్జన్యాలు, దాడులతో పరిశ్రమలను దెబ్బతీశారు అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థ మొత్తాన్ని సర్వ నాశనం చేశారు. అలాంటి కష్టాలనుండి ప్రజలు తమను తాము కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గతంలో 80 శాతానికి పైగా పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టును చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరానికి కేంద్రం నుంచి 12 వేల కోట్లు తీసుకొచ్చాం. నాలుగు నెలల్లో అనేకానేక మహోన్నత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. ప్రతి రంగంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో శ్వేత పత్రాలను విడుదల చేశాం. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించి తీరుతాం అనే మాటకు కట్టుబడి అమలు చేశాం. నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఉచితంగా ఇసుక అందించడమే కాకుండా.. సీనరేజి, జీఎస్టీ కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నాం. జగన్ రెడ్డి చర్యల కారణంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఉన్నంత మేరకు ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్ళేవారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తున్నాం. రవాణా చార్జీలు, లోడింగ్ చార్జీలు చెల్లించి లారీల ద్వారా కూడా తీసుకెళ్లేందుకు అనుమతించాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news