పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నాం. పీఎం స్వనిధి పథకం కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చు అని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకం కింద లబ్దిదారులకు రుణాలపై కేంద్రం 7 శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. కేవలం 4.5శాతం వడ్డీ మాత్రమే లబ్దిదారులు భరించాల్సి ఉంటుంది.పేదలంతా పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
పీఎం స్వనిధి పథకం కింద 5 లక్షల 48వేల 957.. దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో 5 లక్షల 2వేల 894 మంది పేదలకు రుణాలిచ్చారు.పీఎం స్వ నిథి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలు. అత్యుత్తమ పనితీరు కనపరిచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన పలు మైనర్ మున్సిపాలిటీ కమిషనర్లు, బ్యాంకర్లకు కు అభినందనలు. రాష్ట్రంలో ఉన్న పొదుపు మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. పేద మహిళలు లక్షాధికారులు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నాం అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.