కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జూలై నెలలో డీఏ మూడు శాతాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కలిపి అక్టోబర్ నెల జీతం భారీగా రాబోతోంది. అయితే తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీఏ పెంపుపై ప్రకటన విడుదల చేశాయి, అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతాన్ని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏని మూడు శాతం పెంచినట్లు చెప్పింది. క్యాబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
దీపావళి కానుకగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు అందబోతోంది. ఈ ఏడాది మొట్టమొదటిసారి మార్చి నెలలో డీఏ ని నాలుగు శాతం పెంచడం వలన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఏకు సమానంగా 50 శాతానికి చేరుతుంది. అయితే మూడు శాతం పెంచడం వలన 53% అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనిని ఏరియర్లతో పాటుగా అక్టోబర్ నెల జీతంతో అందుకోబోతున్నారు.
ఇది ఏకంగా నాలుగు నెలల డీఏ కావడంతో అక్టోబర్లో భారీగా జీతం రాబోతోంది. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం కేంద్ర బడ్జెట్ లో 8వ వేతన సంఘ ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నెల నుంచి లెక్కపెట్టి మొత్తం బాకాయలని వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా 4 విడతల్లో కేంద్రం చెల్లించబోతోంది ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ఉద్యోగుల రివైజ్డ్ డీఏ తో జీతం వస్తుంది.