తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల ఐదో తేదీ అంటే నవంబర్లో… తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాబోతున్నట్లు… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కూడా… దీనిపై అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… రాహుల్ గాంధీ అసలు ఇక్కడికి రాలేదు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను …. తాను ముందుండి… అమలుపరుస్తానని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫ్రీ బస్సు మినహా ఏ స్కీము… సరిగా అమలు కావడం లేదని తెలంగాణ ప్రజలు మొత్తుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాబోతున్నట్లు… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా… కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారట రాహుల్ గాంధీ. ఎన్నికల కంటే ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై కూడా… రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారట. వాటిని అమలుపరిచేలా వ్యూహరచనలు చేయనున్నారట.