ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన జరిగి తీరుతుంది : మంత్రి కోమటిరెడ్డి

-

మూసి ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్, BRS మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూసి ప్రక్షాళన చేస్తాం అని కాంగ్రెస్.. ఆపుతాం అని BRS నాయకులూ అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేటీఆర్, హరీష్ రావు మూసి ప్రక్షాళనను ఆడుకుంటున్నారు అని ఆయన అన్నారు. నల్గొండ వాళ్లు మూసి నీళ్లు తాగి చనిపోవాలని కేటీఆర్, హరీష్ రావు కోరుకుంటున్నారు అని ఆరోపించారు.

అలాగే ఉద్యమ సమయంలో రెచ్చగొట్టి శ్రీకాంతాచారి మరణానికి కారణమయ్యాడు హరీష్ రావు. ఇప్పుడు మూసి ప్రక్షాళన ఆపి చూడండి కేటీఆర్, హరీష్ రావు.. మీ సంగతి చూస్తా అని హెచ్చరించారు మంత్రి. ఇక ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర సోనియా రాహుల్ ది. శాశ్వతంగా అధికారంలో ఉంటామని అనుకున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదు. ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన జరిగి తీరుతుంది అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news