కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రకరకాల హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు రూ.2,500, కళ్యాణమస్తు ఇలా చాలా హామీలనే ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణమస్తు హామీ ఏమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కూతురు పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలకు రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ధన త్రయోదశి రోజు ఇవాళ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హ్యాండ్ ఇచ్చిన హ్యాండ్, హ్యాండ్ బ్రేక్ ఆన్ ప్రోగ్రెస్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు బండి సంజయ్. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడంలో విఫలం చెందిందన్నారు. బీఆర్ఎస్ ను కూడా ప్రజలు ఏవిధంగా తిరస్కరించారో.. వచ్చే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా అలాగే తిరస్కరిస్తారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.