కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా గాంధీ భవన్ లో కులగణన పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ ఇచ్చారని పేర్కొన్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏమి లేదని.. తనకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేకంగా గుర్తింపును ఇచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం మనందరి బాధ్యత అన్నారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తి గత ఎజెండాతో పని చేయడు అని స్పష్టం చేశారు. ముఖ్యంగా గాంధీ కుటుంబం మాట ఇస్తే.. హరిహరాదులు అడ్డొచ్చినా నెరవేర్చుతుందన్నారు. రేవంత్ రెడ్డా.. మహేష్ కుమార్ గౌడా కాదు.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కోసం కులగణన నవంబర్ 30 లోపు చేపట్టాలన్నారు.