అర్ధరాత్రి హిజ్రాల హల్చల్.. ఖమ్మంలో వాహనదారులపై దాడి!

-

హిజ్రాల ఆగడాలు శృతి మించుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, నేషనల్ హైవేలు, దుకాణా సముదాయాలు, ఫంక్షన్ హాళ్లు, శుభాకార్యాలకు నానా రభస చేస్తున్నారు. సామాన్యుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వారు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వారిపై సామూహిక దాడులకు పాల్పడటం లేదా.. తీవ్ర ఇబ్బందులకు చేస్తున్నారు.ఎవరైనా వారికి ఎదురుతిరిగితే అంతే సంగతులు.. బూతులు తిడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారి తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.

తాజాగా ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఓ హిజ్రా గ్యాంగ్ బీభత్సం సృష్టించింది.గురువారం రాత్రి ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి మద్యం మత్తులో ఉన్న హిజ్రాలు బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలోనే డబ్బులివ్వని ఓ డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌ నుంచి అతడిని లాగి దాడి చేశారు. డీసీఎం తాళాలను సైతం లాక్కున్నారు.దీంతో నడిరోడ్డుపై పదుల సంఖ్యలో వాహనాలను నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మం పట్టణంలో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news