ఏపీలో విజయవంతంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

-

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. పలు కారణాలతో నేడు పెన్షన్ అందని వారికి శనివారం అందించనున్నారు.ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరివెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news