న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే లు క్రీజ్ లో కుదురు కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డెవాన్ కాన్వే 11 బంతుల్లో 4 పరుగులు చేసి పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.
అనంతరం కెప్టెన్ టామ్ లాథమ్ 44 బంతుల్లో 28 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విల్ యంగ్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు రాబట్టేందు ప్రయత్నించాడు. 138 బంతుల్లో 71 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ యంగ్ క్యాచ్ అవుట్‌గా పెవీలియన్ చేరాడు. బ్యాటింగ్ సంచలనం రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 5 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లొ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ 82 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 05, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్ చేయనుంది.