గత కొన్ని రోజులుగా వీగనిజం, వీగన్స్ అనే పదాలు ఇంటర్నెట్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీగన్స్ అంటే వెజిటేరియన్స్ అనీ, వాళ్లు మాంసం తినరని చాలామంది అనుకుంటున్నారు. ఇది కొంతవరకు కరెక్టే. వీగన్స్ మాంసం తినరు. అలాంటప్పుడు వారిని వెజిటేరియన్స్ అనాలి కదా, వీగన్స్ అని ఎందుకంటారన్న సందేహం రావచ్చు.
కొంతమందైతే వెజిటేరియన్ అనే పదానికి మరో అర్థమే వీగన్ కావచ్చని అనుకుంటారు. కానీ వీగన్స్ వేరు. వెజిటేరియన్స్ వేరు. ఈ రెండింటికీ తేడా తెలుసుకోవాలంటే అసలు వీగన్స్ అంటే అసలైన అర్థం తెలుసుకోవాలి.
ప్రతీ సంవత్సరం నవంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వీగన్ డైట్ ఫాలో అయ్యేవారు వీగన్స్ డే సెలెబ్రేట్ చేసుకుంటారు.
అదలా ఉంచితే, ప్రస్తుతం వీగన్స్ కి వెజిటేరియన్స్ కి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
వీగన్స్ అంటే జంతుమాంసంతో పాటు జంతువుల నుండి ఉత్పత్తయ్యే దేన్నికూడా ఆహారంగా తీసుకోరు. ఉదాహరణకు గేదె నుండి పాలు వస్తాయి. పాలతో పెరుగు, నెయ్యి, వెన్న తయారవుతుంది. వీగనిజం ఫాలో అయ్యేవారు పాలు, పాల పదార్థములు అస్సలు ముట్టరు. అంతెందుకు.. తేనేటీగల ద్వారా తేనె తయారవుతుంది దాన్ని కూడా తినరు. ఇంకా, గుడ్లు, ఛీజ్ మొదలగు వాటికి దూరంగా ఉంటారు.
వెజిటేరియన్స్ విషయానికి వస్తే పాలు తాగుతారు, తేనె, ఛీజ్ తో పాటు కొంతమంది గుడ్లు తింటారు.