ఆంధ్రప్రదేశ్ లో దువ్వాడ శ్రీనివాస్ రావు-దివ్వెల మాధురి వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి వార్తల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ సహజీవనం చేయడం.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామనడం.. తిరుమలలో రీల్స్ చేయడం, ఆస్తుల గురించి గొడవలు కావడం ఇలాంటి విషయంలో తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్-మాధురి గురించి తెలియని వారెవ్వరూ లేరు. తాజాగా దువ్వాడ-మాదురి లతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు లింకు ఉందని ఓ నేత పేర్కొన్నారు.
దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి పరిస్థితి.. అరికెపూడి గాంధీ, సంజయ్ పరిస్థితి ఒక్కటేనని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ పేర్కొన్నారు. మొగుడు పేరు అంటే బీఆర్ఎస్ పేరు చెబుతారు. కలిసి తిరిగేది మాత్రం కాంగ్రెస్ అన్నారు. మొగుడి పేరు చెబుతారు.. కానీ మిండని పేరు చెప్పుకోలేరు కదా అని క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.