తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా ఉండాలి : మహేష్ గౌడ్

-

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారు. కుల గణన కు అత్యంత ప్రాధాన్యం ఉన్నందున రాహుల్ వస్తున్నారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నందున రాహుల్ గంట సేపు మాత్రమే ఉంటారు. కుల గణన లో ఎలాంటి అంశాలు ఉండాలో సూచించాలి. కుల గణన అత్యంత ప్రాధాన్యత గా కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది.

రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర లో కుల గణన చేపట్టి ఆయా వర్గాల జనాభా ప్రకారం సంపద పంపిణీ జరగలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. కులగణన ఎన్నో దశాబ్దాల తర్వాత జరుగుతున్నది. కుల గణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇందులో అనేక ప్రశ్నలు పొందుపరచడం జరుగుతోంది. ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సమగ్రంగా మరింత లోతుగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా ఉండాలి అని మహేష్ గౌడ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news