కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఆరోపణలు చేస్తున్నారు : విజయసాయిరెడ్డి

-

ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది. వైయస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారు అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ బిల్లును క్యాబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి విబేధించినా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుంది. కానీ ఈ బిల్లుని రామ్మోహన్ నాయుడు ఆమోదించారు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపి వ్యతిరేకించింది. వైసీపి తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం. ముస్లింల తరఫున వైసీపి ఎప్పుడూ నిలపడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.

కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైసీపి వ్యతిరేకం. రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది. ఆ భూముల్లో చాలాభాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వైసీపి ఖండిస్తోంది. వక్ఫ్ బోర్డు భూములే 50% ఆక్రమణలకు గురయ్యాయి. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైసీపి వ్యతిరేకిస్తుంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news