ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసి సర్కార్ అని…ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప? అని కేటీఆర్ ఆగ్రహించారు. దీనిపై జవాబు చెప్తావా ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ ? అని ప్రశ్నించారు. “వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు.
మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలిందని.. ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది-2 లక్షల జాబ్ లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు అంటూ మండిపడ్డారు. ఏడాదికి 35 రోజులే మిగిలింది – ఎకరాకు ₹15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు… ఏడాదికి 35 రోజులే మిగిలింది – పెంచిన ₹4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు అని ప్రశ్నించారు కేటీఆర్. ఏడాదికి 35 రోజులే మిగిలింది-నెల నెల ఇస్తామన్న ₹2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు అని నిలదీసారు కేటీఆర్.