షాపింగ్ మాల్ కి వెళ్ళినపుడు ఏది పడితే అది కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి

-

షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ అట్రాక్టివ్ గా కనిపించిన ప్రతిదాన్ని కొనే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటి అలవాటును ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కూడా కొందరు చేసుకోలేరు. ప్రస్తుతం దాన్ని కంట్రోల్ చేసుకునే కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం.

డబ్బులు మాత్రమే వాడండి:

ఆన్ లైన్ పేమెంట్ వచ్చినప్పటి నుండి డబ్బులు ఖర్చు చేయడం పెరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చేతిలో నుండి డబ్బులు పోవడం లేదు కదా అన్న ఆలోచనతో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. మీరు మాత్రం అలా చేయకుండా షాపింగ్ కి వెళ్ళినప్పుడు డబ్బుల్ని తీసుకువెళ్లండి. చేతితో డబ్బులను ఇస్తుంటే ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థమవుతుంది.

డిప్రెషన్ లో షాపింగ్ వద్దు:

మీ మనసు బాధగా ఉన్నప్పుడు షాపింగ్ అస్సలు చేయకండి. అలాంటి టైంలో మీ మీద మీకు కంట్రోల్ ఉండదు కాబట్టి ఎక్కువగా ఖర్చు చేస్తారు.

మంచి సంగీతం వినిపించే మాల్ కి వెళ్లొద్దు:

చాలా మాల్స్ లో మంచి సంగీతం ప్లే అవుతూ ఉంటుంది. ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ వాతావరణం మిమ్మల్ని ఎక్కువ ఖర్చు చేసేలా చేస్తుంది. మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే సంగీతం ప్లే అవుతున్న షాప్ లో నుంచి బయటకు వచ్చేయండి.

సేల్స్ పర్సన్స్ తో స్నేహం వద్దు:

వీళ్ళతో స్నేహం పెట్టుకుంటే వాళ్లు ఏమైనా అనుకుంటారేమోనన్న మొహమాటంతో మీరు షాపింగ్ చేయాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, తక్కువ రేటు గల వస్తువు ఏదైనా కొంటే వాళ్ళు ఫీలవుతారేమోనని మీరు ఎక్కువ రేట్ వైపు వెళ్లే అవకాశం ఉంది.

కొత్త నోట్స్ వాడండి:

మొదట్లో కేవలం కరెన్సీ మాత్రమే వాడాలని చెప్పాము. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గా ఉన్న కరెన్సీ నోట్స్ వాడితే మీరు తక్కువ ఖర్చు చేస్తారు. అంత మంచి నోట్స్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే.. మీకు కాస్త బాధ కలుగుతుంది. తక్కువ ఖర్చు పెడతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news