ఏపీ విద్యార్థులకు అలర్ట్…అకౌంట్లోకి డబ్బులు..ఇక కాలేజీలకే చెల్లింపులు!

-

fee reimbursement: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇవాళ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పైన కీలక ప్రకటన చేయనుంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను… కాలేజీల ఖాతా ల్లోకి జమ చేయాలని… ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా… కాలేజీలకే చెల్లించే ఫైలు పై ఇవాళ కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Today is an important announcement on student fee reimbursement monies

అనంతరం ఆమోదం కూడా తెలపనుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో… కొంతమంది విద్యార్థులు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి ఉందట. అందుకే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు విడుదల చేయాలని చంద్రబాబుప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.  కాగా ఏపీ కేబినేట్ సమావేశం  ఇవాళ మధ్యాహ్నం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news