అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అధ్యక్ష పదవీకి మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు అవసరం కాగా.. ట్రంప్ ఇప్పటికే 277 సీట్లను గెలుచుకున్నారు. స్వింగ్ స్టేట్స్ లో సైతం ట్రంప్ ఆధిపత్యంలో ఉండటంతో ఆయన ఘన విజయం సాధించారు. మరోవైపు రిజల్ట్స్ పూర్తయ్యేంత వరకు కూడా ఓటమిని ఒప్పుకోమని కమలా ఫాలోవర్స్ పేర్కొనడం గమనార్హం.
విజయం తరువాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అసాధ్యాన్ని అమెరికా ప్రజలు సుసాధ్యం చేశారు. సరిహద్దులను నిర్ణయిస్తాం. మస్క్ తో సహా నా విజయానికి సహకరించిన వారందరికీ దన్యవాదాలు. అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని పేర్కొన్నారు ట్రంప్. ఎవరైనా చట్టబద్దంగానే దేశంలోకి రావాలి అన్నారు ట్రంప్. అమెరికా ప్రజలు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం. స్వింగ్ స్టేట్లలో విజయం పై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలు తనకు గొప్ప విజయాన్ని అందించారు. ఇక అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తాను. అమెరికా ప్రజల కోసం నిత్యం పని చేస్తానని తెలిపారు.