అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ 224 ఓట్లతో వెనుకంజలో కొనసాగుతున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 270 దాటివేయడంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనట్టు ప్రకటించారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పేరును కూడా ప్రకటించేశారు ట్రంప్. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
గతంలో అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కేటీఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందిస్తూ.. కమలా హారిస్ నిజమైన అమెరికా అధ్యక్షురాలిగా కనిపిస్తుందని.. త్వరలోనే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని చూడబోతున్నామని ట్వీట్ చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కమలా ఓటమి పాలు కావడంతో కేటీఆర్ ట్వీట్ ను స్క్రీన్ షాట్లు తీసి.. సెటైర్లు వేస్తున్నారు. మరోసారి కేటీఆర్ డ్రామా ఫెయిల్ అయిందని.. కేటీఆర్ కేవలం పీఆర్ ప్రొడక్ట్ మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కారణంగా ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతున్నారు.