తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సర్వే పై సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎలాంటి మేలు జరుగుతుందో తెలియనప్పుడు వివరాలు ఇవ్వడం ఎందుకు..? అని ప్రశ్నించారు. సర్వే చేయాలని డిప్యూటీ కమిషనర్ వాళ్ల కొలిగ్స్ ఏఈలు వచ్చారు.
తాను తనతో పాటు నలుగురు కార్పొరేటర్లు సీతాఫల్ మండి, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ కి చెందిన కార్పొరేటర్లు కూడా సర్వేకు వివరాలు ఇవ్వరని ప్రకటించారు. ఇక్కడ అంతా మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ పీపుల్స్ ఉంటారు కాబట్టి.. ప్రతీ ఒక్కరూ ఈ సర్వేతో ఏమైనా మాకు బెన్ ఫిట్స్ ఉంటాయా..? మాకు ఏమైనా లబ్ది చేకూరుతుందా..? అని ఆశ పడుతుంటారు. దానికి సంబంధించి అధికారులను కూడా ప్రశ్నించాం. ఈ సర్వే విషయంలో ఇంటికి వచ్చిన అధికారులకే స్పష్టత లేదన్నారు. ఒకవేళ ప్రజల వివరాలు కావాలంటే.. గతంలో చేసిన సర్వే డేటాను ప్రభుత్వం వాడుకోవచ్చని సూచించారు.