వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై తప్పుడు కేసులు పెడుతున్నారు అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 మందిని అరెస్టు చేశారు అని చెప్పిన ఆయన చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేష్ ను కాటేస్తాయి అన్నారు. చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేష్ అనుభవిస్తారు. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి అని సూచించారు.
ఇక వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఋషికొండ అద్భుతమైన కట్టడం, రాష్ట్రానికి తలమానికం. కానీ రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మూర్ఖుడు, అసమర్ధుడు చంద్రబాబు అని అన్నారు. కానీ ఆ ఋషికొండ భవనాలపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. అయితే జమిలీ ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానాలు కచ్చితంగా పెరుగుతాయి. 2027 తర్వాత మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.