ఆ మూడు రాష్టాల్లో గెలుపెవరిది..? ఎన్డీఏ సత్తా చాటుతుందా..? ఇండియా కూటమి పుంజుకుంటుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది.. మరికొన్ని రోజుల్లో ఆయా రాష్టాల్లో పోలీంగ్ జరుగుతూ ఉండటంతో అధికార, విపక్షాలు తమ ప్రచారాలను పీక్స్ కు తీసుకెళ్లాయి.. అధికార పార్టీ అవినీతికి ప్రతిపక్షాలు జనాల్లోకి తీసుకెళ్తుంటే.. చేసిన అభివృద్దిని అధికార పార్టీ చెప్పుకుంటోంది.. దీంతో ఆయా రాష్టాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది..
త్వరలోనే మహారాష్ట, జార్ఖండ్, డిల్లీ రాష్టాల్లో ఎన్నికలు జరగున్నాయి.. అయితే ఈ రాష్టాల్లో గెలుపు కోసం ఏన్డీఏ, ఇండియా కూటములు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.. ఇక్కడ ఒక్కో రాష్టం.. ఒక్కో వైవిధ్యమైన ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి.. మహారాష్టలో గెలుపు బిజేపీ, కాంగ్రెస్ కు ఎంతో అవసరం.. ముఖ్యంగా శివసేన, ఎన్సీపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. దీంతో ఇక్కడ గెలుపు ఎవరి వరిస్తుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది..
ఝార్ఖండ్ ఎన్నికలు ఎన్డీఏ, కాంగ్రెస్ కూటములకు అగ్ని పరీక్షగా మారాయి.. జేఎంఎంతో జతకట్టిన కాంగ్రెస్.. బిజేపీకి సవాల్ విసురుతోంది.. హిందూత్వంతో పాటు.. జేఎంఎం నేతల అవినీతి అక్రమాలను బిజేపీ ప్రచార అస్త్రంగా మార్చుకుని దూసుకెళ్తోంది.. ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలుంటే.. ఈ నెల 13,20న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. ఈసారి జార్ఖండ్ లో పాగా వెయ్యాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది.. బిజేపీ అధికారంలోకి వస్తే.. చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చట్టం చేస్తామని నేతలు చెబుతున్నారు..
ఇక డిల్లీలో బిజేపీకి అధికారం దక్కక చాలా రోజులవుతోంది.. ఆప్ వచ్చిన తర్వాత ఆ పార్టీనే అధికార పగ్గాలను చేపట్టింది.. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు ఉండటంతో అయన రాజీనామా చేసి..అతిషిని సీఎంను చేశారు.. రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు కేజ్రీవాల్.. డిల్లీలో ఆప్ అభివృద్ది కంటే అవినీతే ఎక్కువ చేసిందని.. తమకు అవకాశం కల్పించాలని కమలం పార్టీ నేతలు ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు.. దీంతో ఈ మూడు రాష్టాల్లో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి..