తెలంగాణలో పదో తరగతీ పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఇచ్చింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 02 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు.. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోగలరు.
ప్రతీ ఏడాది మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు జరిగే విషయం తెలిసిందే. విద్యార్థులకు నవంబర్ నెల నుంచి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అదనంగా స్టడీ అవర్స్ లో విద్యార్థులు వీక్ గా ఉన్న సబ్జెక్జ్ పై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.