కేటీఆర్ ఢిల్లీకి, అమెరికా కూడా పోవచ్చు. కానీ కేటీఆర్ అరెస్టు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక కేటీఆర్ ను జైలుకు పంపుతా అనడానికి నేను బండిసంజయ్ ని కాను అని చెప్పిన పొన్నం.. అలాగే బీజేపీ, BRS ఢిల్లీలో దోస్తి.. గల్లిలో కుస్తీ అని అన్నారు. ఇక రైతుల ధాన్యం ప్రభుత్వం కొంటుంది. రైతులని వేధిస్తే ఉపేక్షించం. ఢిపల్టర్లని ప్రక్కన బెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చెయ్యాలి. బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లకి ధాన్యం కేటాయించేది లేదు అన్నారు.
ఇక కాటన్ రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం కాటన్ రైతులకి ఇబ్బందులు లేకుండా కొనాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుందాం. బీజేపి వాళ్లు వచ్చి ధాన్యం కొనుగోలు దగ్గర నిరసన తెలిపితే, మేము జిన్నింగ్ మిల్లుల దగ్గరికి వెళ్లి నిరసన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ 600 బస్సులు కొనుగోలు చేయించాలని ఆలోచన చేస్తుంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.