జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారన జరిగింది. వాదనలు విన్నటువంటి ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. సోషల్ మీడియాలో యాక్టివిస్టుగా ఉన్న సజ్జల భార్గవ్.. గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని భీమవరం, కదిరి పీఎస్ లలో నమోదైన కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం మారిన తరువాత సైతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని భార్గవ్ పై ఆరోపణలున్నాయి.
దీంతో హైకోర్టును భార్గవ్ ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును సజ్జల భార్గవ్ రెడ్డి కోరారు. మరోవైపు నిన్న సజ్జల భార్గవ్ తో పాటు అర్జున్ రెడ్డి కొంత మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.