కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలు ఎందుకు? : తమ్మినేని 

-

దేశ జనాభా లెక్కలలో కులగణన చేర్చాలనే చర్చ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నది. ఈ సర్వే పత్రం లో కులంతో పాటు ఆస్తులు, రాజకీయ, వ్యవసాయ భూములకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రశ్నలున్నాయి. ఆ వివరాలను ఇవ్వడానికి పలు అనుమానాలు, వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అటువంటి ప్రశ్నలను మినహాయించాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది అని తమ్మినేని వీరభద్రం అన్నారు.
వ్యక్తిగత ప్రశ్నలకు సంబంధించిన వివరాలు వెల్లడిరచడానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎదురు తిరుగుతున్నట్లు, దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేషన్ కార్డులు తొలగించడానికి, సంక్షేమ పథకాలు రద్దు చేయడానికే సర్వే చేస్తున్నారని ప్రజల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి. కొన్ని చోట్ల సర్వే చేస్తున్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లను అనుమానించే సందర్భాలు కూడా వున్నాయి. అందువల్ల ప్రభుత్వం స్పందించి, అఖిలపక్ష సమావేశం నిర్వహించి నివృత్తి చేయాలని కోరుతున్నాం అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news