బలమైన క్యాడర్ ఉన్న ఆ నియోజకవర్గంలో.. నడిపించే నాయకుడు లేక కారు పార్టీ డీలా పడుతుంది.. భవిష్యత్తుపై క్యాడర్ కు భరోసా ఉన్నప్పటికీ.. నేతలు ముందుకు రాకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.. పార్టీ కార్యక్రమాల్లో కూడా నేతలు యాక్టివ్గా ముందుకు రాకపోవడంతో… నడిపించే నాయకుడు కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..?
పాలమూరు జిల్లాలోని గద్వాల్ రాజకీయం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.. 2014లో ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ గెలవగా.. తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కారు పార్టీ అభ్యర్థులై గెలిచారు.. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు.. దీంతో పాలమూరు జిల్లాలో నడిగడ్డగా ఉన్న గద్వాల బిఆర్ఎస్ కి సరైన నాయకుడు లేక పార్టీ డీలా పడిపోయింది.. రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి వీచినా.. గద్వాలలో మాత్రం కృష్ణమోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డిగెలుపొందారు.. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గ కేడర్ దిక్కుతోచని స్థితిలో ఉంది.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. తమను ముందుండి నడిపించే నాయకుడు లేరనే ఆందోళన కేడర్లో కనిపిస్తోంది..
గద్వాల్ నియోజకవర్గ బాధ్యతలు చేజిక్కించుకునేందుకు టిఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.. గులాబీ బాస్ కెసిఆర్ తో పాటు.. కేటీఆర్, హరీష్ రావుల చుట్టూ నేతలు తిరుగుతున్నారట.. అయితే ఈ వ్యవహారంలో అధిష్టానం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా సరైన నేతకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలనే భావనలో గులాబీ అధిష్టానం ఉందట.. నియోజకవర్గం మీద పూర్తిస్థాయి పట్టున్న బలమైన నేత కోసం అధిష్టానం అన్వేషణ మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతోంది.. మొదటినుంచి పార్టీతోనే నడుస్తున్న వెంకటరాములతో పాటు రంజిత్ కుమార్ హనుమంతు, ఆంజనేయులు గౌడ్ లాంటి నేతలు ఇన్చార్జి బాధ్యతల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.. నాలుగేళ్ల పాటు పార్టీని నడిపించి తర్వాత టిక్కెట్లు చేజిక్కించుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేటీఆర్ స్థాయిలో లాబీయింగ్ లు మొదలుపెట్టినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.. అయితే అధిష్టానం పెద్దలు మాత్రం కాంగ్రెస్ని బలంగా ఎదుర్కొనే ఢీటైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్నారట.. కేవలం నియోజకవర్గ ఇన్చార్జిగా మాత్రమే కాకుండా జిల్లాని ముందుండి నడిపించే సమర్థవంతమైన నేత అవసరమని కారు పార్టీ భావిస్తుందట.. గద్వాల్ నియోజకవర్గంలో పార్టీ పట్టు తగ్గకుండా.. క్షేత్రస్థాయి నుంచి సంస్థగతంగా బలోపేతం చేసే నాయకుడు కావాలనే అభిప్రాయంలో అధిష్టానం ముందని తెలుస్తుంది..
అయితే ఇన్చార్జిని పెట్టకపోవడంపై పార్టీలో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.. గద్వాల కాంగ్రెస్ లో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని.. బిఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఇన్చార్జి విషయంలో అధిష్టానం తొందరపడడం లేదనే టాక్ పార్టీలో నడుస్తోంది. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ తో పాటు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉండడంతో వారిలో ఎవరో ఒకరు తిరిగోస్తారాని స్థానిక నేతలు గట్టిగా నమ్ముతున్నారు.. మొత్తంగా మరికొద్ది రోజుల్లో గద్వాల బిఆర్ఎస్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారబోతోంది..